Monday, December 14, 2015
Swarna Kamalam Songs - Sivapoojaki - Bhanupriya - Venkatesh
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వ
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
నటనాంజలితో బ్రతుకును తరించనీవా
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
పడమర పడగలపై మెరిసే తారలకై పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
ఎదురించిన హృదయరవళి ఓంకారం కానీ
శివపూజకు చిగురించిన సిరిసిరిమువ్వ
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వ.. సిరిసిరిమువ్వ..
తన వేళ్ళే సంకెళ్లై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తూ ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెరగానం నీకు తోడుగా
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
చలితచరణజనితం నీ సహజవిలాసం
జ్వలితకిరణకళితం సౌందర్యవికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
గగనసరసి హృదయంలో వికసిత శతదళ శోభన సువర్ణకమలం
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః
Subscribe to:
Comments (Atom)
Chanakya
ఆఫీసులన్నాక కొలీగ్‌ల మధ్య రాజకీయాలు సహజం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోసమే ఉద్యోగులందరూ ప్రయత్నిస్తారు. అయితే కేవలం కొ...
-
వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది .. వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్...
-
పంచభూతాల సాక్షిగా పంచామృతాల సాక్షిగా పంచేంద్రియాల సాక్షిగా పంచాక్షరాల సాక్షిగా నా పంచ ప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమ...
-
అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరౌతోంది ఎదలో గాయం అయ్యో వెళిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే...