Tuesday, May 11, 2021

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా- Amma Amma Song Lyrics Raghuvaran Btech

 అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా

నువ్వే లేక వసివాడానమ్మా

మాటే లేకుండా నువ్వే మాయం

కన్నీరౌతోంది ఎదలో గాయం

అయ్యో వెళిపోయావే

నన్నొదిలేసి ఎటుపోయావే

అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట

నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంటా

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా

నువ్వే లేక వసివాడానమ్మా


చెరిగింది దీపం కరిగింది రూపం

అమ్మా నాపై ఏమంత కోపం

కొండంత శోకం నేనున్న లోకం

నన్నే చూస్తూ నవ్వింది శూన్యం

నాకే ఎందుకు శాపం

జన్మల గతమే చేసిన పాపం

పగలే దిగులైన నడిరేయి ముసిరింది

కలవరపెడుతోంది పెను చీకటి

ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది

బ్రతికి సుఖమేమిటి

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా

నువ్వే లేక వసివాడానమ్మా


విడలేక నిన్ను విడిపోయి ఉన్నా

కలిసే లేనా నీ శ్వాసలోన

మరణాన్ని మరచి జీవించి ఉన్నా

ఏచోట ఉన్నా నీ థ్యాసలోన

నిజమై నే లేకున్నా

కన్నా నిన్నే కలగంటున్నా

కాలం కలకాలం ఒకలాగే నడిచేనా

కలతను రానీకు కన్నంచున

కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన

చిగురై నిను చేరనా

అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా

నువ్వే లేక పసి వాడానమ్మా

అడుగై నీతోనే నడిచొస్తున్నా

అద్దంలో నువ్వై కనిపిస్తున్నా

అమ్మా వెళ్లిపోయావె

నీలో ప్రాణం నా చిరునవ్వే

అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట

వెన్నంటే చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా...

No comments:

Chanakya

  ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొ...