Saturday, August 5, 2017

నీలకంధరా దేవా దీనబాంధవా రావా : భూకైలాస్ (1958)



జయ జయ మహాదేవ శంభో సదాశివా...
ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా...

పల్లవి :
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా ||2||
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ ||2|| ||నీలకంధరా||

చరణం 1
అన్యదైవము గొలువా...
అన్యదైవము గొలువా నీదుపాదము విడువా ||2||
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా ||2|| ||నీలకంధరా||

చరణం 2
దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీయమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమారక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసవాసా...
కైలాసవాసా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా ||2||
కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా ||2||
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా ||2|| ||ఫాలలోచన||
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా ||3||

సంగీతం : R.సుదర్శనం , R.గోవర్ధనం
రచన : సముద్రాల
గానం : ఘంటసాల

No comments:

Chanakya

  ఆఫీసుల‌న్నాక కొలీగ్‌ల మ‌ధ్య రాజ‌కీయాలు స‌హ‌జం. బాస్ లేదంటే పై అధికారి మెప్పు పొందడం కోస‌మే ఉద్యోగులంద‌రూ ప్ర‌య‌త్నిస్తారు. అయితే కేవ‌లం కొ...